శాంతినగర్‌లో చవితి శోభ..!
– లంబోదరుడికి మాజీ జెడ్పీటీసీ పూజలు
– దర్శించకున్న ఉప్పరి స్వరూప మల్లేశం, భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శాంతినగర్‌లో వినాయక చవితి శోభ సంతరించుకుంది. శాంతినగర్ కాలనీలో మాజీ జడ్పిటీసీ ఉప్పరి స్వరూప మల్లేశం ఆధ్వర్యమంలో ఏకదంతా వినాయక ఉత్సవ కమిటీ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పరి రమేష్ మంజుల దంపతులు మొదటి పూజ చేశారు. గణనాథునికి ఇష్టమైన ఉండ్రాల్లు, పిండి వంటలు సమర్పించారు. ఉండ్రాలయ్యా దయుంచయ్య స్వామి అంటూ వేడుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లేశం ఉత్సవ కమిటీ నాయకులు బాల్ రెడ్డి, పద్మారావు, వెంకట్ రెడ్డి, అయ్యప్పు రెడ్డి, మానిక్ రావు, రవి, రాములు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి…

