అదనంగా నిధులు కేటాయించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

 అదనంగా నిధులు కేటాయించండి
– బీజేపీ ఫ్లోర్ లీడర్ న‌రుకుల‌ సింధూజ నరేందర్ గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణంలోని బీజేపీ ప్రాతినిధ్యం వహించే సభ్యుల వార్డులలో అదనంగా నిధులు కేటాయించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ నరుకుల సింధూజ నరేందర్ గౌడ్ కోరారు. శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం సింధూజగౌడ్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్‌తో కలిసి మాట్లాడారు. గల్లి గల్లికి పైలెట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పర్యటించి 36 వార్డులో సమస్యలు తెలుసుకుని నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే మున్సిపల్ పరిధిలోని బీజేపీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 1, 12, 23, 24వ వార్డులు మురికి వాడలు ఉన్నాయని తెలిపారు. కావున ఆయా వార్డులలో సీసీ రోడ్లు, మురుగుకాలువలు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు ప్రస్తుతం కేటాయించిన నిధులకు అదనంగా రూ. 10 ల‌క్ష‌ల‌ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కోరారు. మరోవైపు కౌన్సిల్ సమావేశంలో తాండూరు పట్టణంలో కుక్కల బెడదను పరిష్కరించాలని కోరడం జరిగిందని తెలిపారు.