చెంగోల్‌లో ప్రారంభమైన పోచమ్మ జాతర ఉత్సవాలు
– రేపు ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన
– పూజల్లో పాల్గొన్న సర్పంచ్ మల్లీశ్వరీ శేఖర్ గౌడ్ దంపతులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో వెలసిన పోచమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం గ్రామ సర్పంచ్ మల్లీశ్వరీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ పండితులు కిశోర్ పంతులు బృందం ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యావచనము, ధన్యదివాసం, జలాధివాసం, శెయ్యి దివాసం పూజలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మల్లీశ్వరీ ఖర్ గౌడ్ దంపతులు పూజలో పాల్గొని కార్యక్రమాలను కొనసాగించారు. అదేవిధంగా రేపు శనివారం ఆలయంలో పోచమ్మ అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన చె పడుతున్నట్లు వారు తెలిపారు. జల్డిబిందే కార్యక్రమం తరువాత విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని చెప్పారు. మధ్యాహ్నం అన్నదానం.. ఊరడమ్మ బోనాలు జరుగుతాయని అన్నారు. దీంతో పాటు ఆదివారం హైదరాబాద్ నాగిని అమ్మ ఆధ్వర్యంలో బోనాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ జాతర ఉత్సవాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

