హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్షులుగా స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శిగా సాయిపూర్ బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకన్నారు. శనివారం పట్టణంలోని తులసీ గార్డెన్‌లో సమావేశం ఏర్పాటు చేసి సమితి గౌరవాధ్యక్షులుగా రాజుగౌడ్, అధ్యక్షురాలుగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శిగా పట్లోళ్ల సాయిపూర్ బాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా కౌన్సిలర్ రాము, బాతుల నాగు, ఎస్పీ రవి, అంతారం కిరణ్ కుమార్,

సహా కార్యదర్శులుగా బంటు మల్లప్ప, వెంకట్ సాయి, అష్టికర్ ఆశిష్, కోట్ల వెంకటేష్, బొంబాయి జగదీష్, టిల్లు ముదిరాజ్, చాకలి నర్సింలు, బాలు శివాజీ, సోషల్ మీడియా కార్యదర్శిగా తాండ్ర నరేష్, లీగల్ అడ్వయిజర్‌గా పాశం రవికుమార్, పంజుగుల గుండప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు సమితి ప్రధాన కార్యదర్శి రజనికాంత్ ఆధ్వర్యంలో హిందూ బందువుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

