ఏవీఎన్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఏవీఎన్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్
– యాలాల మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని జుంటుపల్లి, యాలాల్, అగ్గనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీజేపీ మద్దతు ఇస్తున్న అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఏవీఎన్‌ రెడ్డి కృషి చేస్తారని నమ్మకంతో బీజేపీ మద్దతు ఇస్తుందని అన్నారు. అదే నమ్మకంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్‌ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో 1మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హన్మంతు ముదిరాజ్, మండల అధ్యక్షులు మహిపాల్, రామ్యానాయక్ తదితరులు ఉన్నారు.