ఉసిరి ఆరోగ్య సిరి..!
– ఎసీడీటీ, గుండె మంటలకు చక్కటి ఔషదం
దర్శిని హెల్త్: ఉసిరి పండును ఆరోగ్య సిరిగా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. రోజూ తీసుకుంటే మంచి ఆరోగ్య సిద్దిని ప్రసాదిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటారు. ఔషద గుణాలతో నిండిన ఈ ఉసిరి గుండెల్లో మంట, ఎసీడీటీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గంగా భావిస్తారు. ఆధునిక కాలంలో చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రజలు అధిక డోసు ఉన్న మందులను వాడుతున్నారు. కొంతకాలం ఉపశమనం ఉన్నప్పటికీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. అందుకే చాలామంది ఆయుర్వేదం మంచిదని సిఫార్స్ చేస్తున్నారు. ముఖ్యంగా దీనిని ప్రతి సీజన్‌లో ఉపయోగించవచ్చు. దీనిని తినడం ద్వారా శరీరంలోని చాలా విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. కొద్ది క్షణాల్లోనే మంచి ఉపశమనం కలుగుతుంది. ఉసిరి పొడిని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. కడుపులో గ్యాస్ సమస్య దూరమవుతుంది.
ఇది కాకుండా మీ శరీరం శక్తివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా ప్రతి రోజూ ఒక ఉసిరికాయను తిన్నట్లతే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి. కఫం తగ్గుతుంది. మేధస్సు పెరుగుతుంది. వీర్యపుష్టి కలుగుతుంది. శారీరక బలం పెరుగుతుంది. త్రిదోషాలు నివారించవచ్చు. రోజుకు మూడు ఉసిరికాయల చొప్పున తింటే అన్ని రకాల పైత్యాలూ తగ్గుతాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎండబెట్టిన ఉసిరిపండ్ల చూర్ణంలో పసుపు ఒక గ్రాము, తేనె ఒక గ్రాము వేసుకొని రోజూ తింటే, షుగర్ వ్యాధి దూరమవునని కొందరు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా నోటి అల్సర్‌తో బాధపడుతున్న వారు కొంచెం ఉసిరి రసాన్ని నీతితో కలిపి పుకిలిస్తే అల్సర్స్ తగ్గుతాయి. కీళ్లనొప్పులు ఉంటే ఉసిరిని రోజు తీసుకోవటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఉసిరికాయలు తిన్నా,జ్యూస్‌లుగా వాడిన మేలే.

