ఐదుగురు పేకాట రాయుళ్లపై కేసు

క్రైం తాండూరు వికారాబాద్

ఐదుగురు పేకాట రాయుళ్లపై కేసు
– రూ. 4690లు, 52 పేకాట ముక్కలు స్వాదీనం
– వివరాలను వెల్లడించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాత్రి వేళ ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురు నిందితులపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలోని గ్యాస్ గోదాం సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శ్రీనివాస్, జై, పవన్, మహేష్, షామోదిన్ అనే ఐదుగురు నిందితులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 4690ల నగదుతో పాటు 52 నిషేధిత పేక ముక్కలను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా నిషేధిత జూదం ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.