హామిల అమల్లో తెలంగాణ సర్కారు నిర్లక్ష్యం
– ఏం సాధించారని కేసీఆర్‌కు జన్మదిన వేడుకలు
– కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం
– తాండూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇచ్చిన హామిలను నెరవేర్చడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గాడిదకు జన్మదిన వేడుకలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో తాండూరు మండలం కరణ్ కోట్ పోలీసులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్, నాయకులు రాము, అఫ్రోజ్‌లను ముందస్తు అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా బోయ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఉద్యోగాల ఖాళీలను భర్తి చేయకుండా, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని అగ్రహం చేశారు. ఇచ్చిన హామిలను నెరవేర్చకుండా ఏం సాధించారని కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ సర్కారు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

