ఇక మ‌హిళ సంఘాల జ‌న‌రిక్ మెడిక‌ల్ షాపులు

ఆరోగ్యం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

మ‌హిళ సంఘాల‌కు మ‌హ‌ద్భాగ్యం..!
– స్త్రీనిధి ద్వారా జ‌న‌రిక్ మెడిక‌ల్ దుకాణాలు
– జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల‌లో ఏర్పాటుకు క‌స‌ర‌త్తు
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: జిల్లాలోని మ‌హిళ సంఘాల‌కు మ‌హ‌ద్భాగ్యం వ‌రించింది. స్త్రీనిధి ద్వారా ఇప్ప‌టికే మ‌హిళ సంఘాల‌కు ఎల‌క్ట్రానిక్ వాహ‌నాల‌ను అందించేంద‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా మ‌హిళ సంఘాల ఆధ్వ‌ర్యంలో జ‌న‌రిక్ మెడిక‌ల్ దుకాణాల‌ను ఏర్పాటు చేసేందుకు క‌స‌ర‌త్తును ప్రారంభించారు. తొలి విడ‌త‌లో వికారాబాద్, ప‌రిగి, కోడంగ‌ల్, తాండూరు మున్సిప‌ల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

రూ. 3 ల‌క్ష‌ల సౌభాగ్య నిధితో..
సాభాగ్య ప‌థ‌కం కింద జ‌న్ ఔష‌ది స్లోర్ పేరుతో మ‌హిళ సంఘాల‌కు రూ. 3 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు అందించేందుకే స్త్రీనిధి అధికారులు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇందుకోసం మ‌హిళ సంఘాల గుర్తింపు ప్రక్రియ‌ను ప్రారంభించారు. పొదుపు సంఘాల‌కు చెందిన స‌భ్యుల పిల్ల‌లు డీఫార్మ‌సీ, బీ ఫార్మ‌సీ, ఎంఫార్మ‌సీ విద్యార్హ‌త క‌లిగిన వారికి రుణ స‌దుపాయం క‌ల్పించ‌నున్నారు. అర్హుల‌ను గుర్తించిన త‌రువాత గ్రామైక్య తీర్మానం తీసుకోవాల‌నే నిబంధ‌న విధించింది. దీంతో పాటు దుకాణం ఏర్పాటు కోసం సంబంధిత డ్ర‌గ్ ఇనుస్పెక్ట‌ర్ అనుమ‌తి, దృవీక‌ర‌ణ ప‌త్రం, కోటేష‌న్, విద్యార్హ‌త దృవీక‌ర‌ణ ప‌త్రాలు, స్త్రీనిధి అధికారుల‌కు ద‌ర‌ఖాస్తుల త‌ప్ప‌న‌స‌రి అని అధికార యంత్రాంగం స్ప‌ష్టం చేసింది.

పేద‌ల‌కు, మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజ‌నం
మ‌హిళ సంఘాల ద్వారా జ‌న‌రిక్ మెడిక‌ల్ దుకాణాలు అందుబాటులోకి వ‌స్తే జిల్లాలోని పేద‌ల‌కు, మ‌హిళ‌ల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. అధికంగా మ‌హిళ‌లు, పేద‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఆసుప‌త్రికి వెళ్ల‌లేక.. ప‌రిస్థితులు అనుకూలించ‌గా ఖ‌రీదు ఎక్కువైనా మందు బిల్ల‌ల‌తో కాలం వెల్ల‌దీస్తున్నారు. జ‌న‌రిక్ మెడిక‌ల్ దుకాణాలు ఏర్పాటు చేస్తే ఖ‌ర్చు భారం త‌గ్గ‌తుంద‌ని భావ‌న మొద‌లైంది. అందుబాటులోకి వ‌స్తే మ‌హిళ‌లు, పేద‌లకు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

పార‌ద‌ర్శకంగా దుకాణాల ఏర్పాటు : స్త్రీనిధి జిల్లా మేనేజ‌ర్ వేణు
స్త్రీనిధి ద్వారా సౌభాగ్య ప‌థ‌కం కింద ఏర్పాటు చేస్తున్న జ‌న‌రిక్ మెడిక‌ల్ దుకాణాల ఏర్పాటు విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త‌కు ప్రాధాన్య‌మివ్వ‌డం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే జిల్లాలో మ‌హిళ సంఘాల గుర్తింపును ప్రారంభించ‌డం జ‌రిగింది. ఇప్ప‌టికే దుకాణాలు ఉన్న వారికి కాకుండా కొత్త‌వారికే అవ‌కాశం క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. అన్ని అర్హత‌లు ఉన్న వారికి నిధులు కేటాయించి దుకాణాల‌ను ప్రారంభించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రిగింది. వ‌చ్చేనెల 15 క‌ల్లా అన్ని మున్సిపాల్టీల‌లో ఏర్పాటుకు దృష్టిసారించ‌డం జ‌రిగింది.