స‌ర్పాల‌తో స్టంట్లు..!

క్రైం జాతీయం తెలంగాణ

స‌ర్పాల‌తో స్టంట్లు..!
– కాటేసిన త్రాచుపాము
– నెట్టింట్లో వీడియో వైర‌ల్
ద‌ర్శిని డెస్క్: స‌ర్పాల‌తో స్టంట్లు చేయాల‌నుకున్న ఓ యువకుడు వాటి కాటుకు ఆసుప‌త్రి పాల‌య్యాడు. ప‌ట్టుకువ‌చ్చిన పాములతో పోజిలిస్తే చిర్రెత్తిన ఓ త్రాచుపాము కాటేసి చుక్క‌లు చూపించింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కర్నాటకకు చెందిన మాజ్ స‌య్య‌ద్ అనే యువ‌కుడు మూడు పాములతో ఓ భయంకరమైన స్టంట్ చేద్దామ‌ని డిసైడ్ అయ్యాడు. అనుకున్న‌దాని ప్ర‌కారం మూడు త్రాచుపాములను ముందు ఉండి త‌మాషా చేస్తున్నాడు. ఈ క్రమంలో వాటి తోకలను పట్టుకోని లాగుతూ కదిలిస్తుంటాడు. ఇందుకు అనుగుణంగా అవి కూడ‌.. దూకుడుగా స్పందిస్తుంటాయి. అందులో ఓ పాము ఒక పాము అతనిపై ఒక్కసారిగా దాడి చేసింది. తన నోటితో ప్యాంట్‌ను గట్టిగా పట్టుకుంటుంది. వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు దాని తోక పట్టుకొని లాగేందుకు ప్రయత్నించినా అది గట్టిగా పట్టుకోనే కనిపిస్తుంది. సీన్ క‌ట్ చేస్తే ఈ పాము కాటుతో సయ్యద్ ఆసుపత్రి పాలయ్యాడు. పాము కాటుతో సయ్యద్ ఇప్పటివరకు 46 యాంటీ-వెనమ్ ఇంజెక్షన్లను తీసుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. వన్య‌ప్రాణాల‌తో చెల‌గాట‌మాడిన‌ అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.