కేంద్రంపై పోరుచేద్దాం..!
– 24న విస్తృతస్థాయి సన్నాహక సమావేశం
– భారీగా తరలిరండి : ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వరిధాన్యం కొనుగోళ్లపై వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న కేంద్రంపై పోరు చేసేందుకు అందరు సిద్దంగా ఉండాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రం మొండి వైఖరి, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈనెల 24న టీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సన్నాహాక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. గురువారం తాండూరు పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం వేదికగా ఉదయం 11:00 గంటలకు నిర్వహించే నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సన్నాహక సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వైస్ ఎంపీపీలు, రైతు బంధు మండల మరియు గ్రామ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా మండలాల పార్టీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తప్పకుండా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర వైఖరిపై వెనుకడుగు వేయకుండా పోరుకు సిద్దమవుదామన్నారు.

