సగానికి తగ్గిన కరోనా కేసులు
– తాండూరులో 65 మందికి పాజిటివ్ నిర్దారణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలో కరోనా కేసులు సగానికి తగ్గాయి. గత రెండు రోజులుగా వందకు పైగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం కేసుల వేగానికి చిన్న కళ్లెం పడింది. జిల్లా ఆసుపత్రి, మాతాశిశు ఆసుపత్రిలో 193 మందికి నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో 65 మందికి పాజిటివ్ అని తేలింది.
జిల్లా ఆసుపత్రిలో 145 మందికి పరీక్షలు నిర్వహించగా 49 మందికి, మాతా శిశు ఆసుపత్రిలో 48 మందికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ అని నిర్దారణ అయినట్లు పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్ తెలిపారు. గత రెండు రోజులుగా నమోదైన కేసులతో పోలిస్తే ఆదివారం సగానికి తగ్గుముఖం పట్టాయని తెలిపారు. మరోవైపు వైద్యులు మాట్లాడుతూ ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమాన తప్పదని పోలీసులు హెచ్చిస్తున్నారు. కరోనా ఆంక్షల పట్ల ఎవ్వరు నిర్లక్ష్యం ప్రదర్శించరాదని సూచిస్తున్నారు.


