జిల్లాలో భారీగా జ‌ప్తు వాహ‌నాల వేలం

క్రైం తాండూరు వికారాబాద్

జిల్లాలో భారీగా జ‌ప్తు వాహ‌నాల వేలం
– ఈనెల 31న పోలీసు శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హ‌ణ
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిది: వివిధ కేసుల్లో ప‌ట్టుబ‌డి జ‌ప్తు చేసిన వాహ‌నాల‌కు వికారాబాద్ జిల్లా పోలీసులు వేలం వేయ‌నున్నారు. భారీ ఎత్తున వాహ‌నాల‌ను వేలం వేస్తున్న‌ట్లు ఆ శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇందులో 273 బైకులు, 40 ఆటోలు, 15 కార్లు(తుక్కు కింద‌), మ‌రో 30 బైకులు, 1 ట్రాక్ట‌ర్(న‌డిపించేది)ను వేస్తున్న‌ట్లు తెలిపారు. వీటిని వివిధ కేసుల్లో జ‌ప్తు చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. ఈనెల 31న ఉద‌యం 11-30 గంట‌ల‌కు వేలం వేస్తున్న‌ట్లు అధికారులు విడుద‌ల చేసిన‌ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 30వ తేదిన అస‌క్తిగ‌ల వారు వాహ‌నాల‌ను త‌నిఖీ చేసుకోచ్చ‌ని సూచించారు. 31న గురువారం వికారాబాద్ సూర్య ప్ర‌కాష్ న‌గ‌ర్లోని జిల్లా పోలీస్ శిక్ష‌ణ కేంద్రంలో వాహ‌నాల వేలం ఉంటుంద‌ని తెలిపారు. పూర్తి వివ‌రాల‌కు 9441037994, 9492922964ల‌కు సంప్ర‌దింవ‌చ్చ‌ని సూచించారు. అస‌క్తిగ‌ల వారు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.