జ‌ర్న‌లిస్టు గౌస్‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు వికారాబాద్

జ‌ర్న‌లిస్టు గౌస్‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: పేద్దేముల్ మండ‌లంకు చెందిన న‌మ‌స్తే తెలంగాణ సీనీయ‌ర్ రిపోర్ట‌ర్ గౌస్‌ను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. గ‌త కొన్ని రోజులుగా గౌస్ అనారోగ్యానికి గుర‌య్యారు. ఇటీవ‌లే చికిత్స పొంది గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోమ‌వారం పెద్దేముల్ లోని గౌస్ నివాసానికి చేరుకున్నారు. గౌస్‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించి ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మ‌నోధైర్యంగా అనారోగ్యాన్ని జ‌యించాల‌న్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండ‌ల పార్టీ అధ్య‌క్షులు కోహిర్ శ్రీ‌నివాస్ యాద‌వ్, మాజీ అధ్య‌క్షులు నారాయ‌ణ రెడ్డి, నాయ‌కులు, గ్రామ యువ‌కులు ఉన్నారు.