కార్మికుల సంక్షేమానికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఎమ్మెల్యేను సన్మానించిన న్యాయవాది గోపాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం తాండూరు నియోజకవర్గ అధ్యక్షులుగా నియామకమైన న్యాయవాది గోపాల్ ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కలిసి సన్మానించారు. తనకు నియోజకవర్గ అధ్యక్ష పదవి కల్పించినందుకు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నివర్గాల కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని అందించడమే కాకుండా అన్ని రంగాల కార్మికుల జీతాలు పెంపు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే నన్నారు. అనంతరం తాండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ కె.వి విభాగం అధ్యక్షునిగా నియమితులైన గోపాల్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ కె.వి విభాగం అధ్యక్షునిగా కార్మిక పక్షాన నిలుస్తూ కార్మికుల సంక్షేమానికి ఎల్లవేళల కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో అన్నిరకాల కార్మిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ వారి ఉన్నతికి పాటుపడతానని అన్నారు. మేడే కార్మిక దినోత్సవాన్ని తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

