చంద్రయాన్-3 కోసం చిన్నారుల ప్రార్థనలు

తాండూరు రాజకీయం వికారాబాద్

చంద్రయాన్-3 కోసం చిన్నారుల ప్రార్థనలు
– ఆయేషా స్కూల్లో ఆకట్టుకున్న ప్రదర్శన
– అభినందించిన యజమాన్యం, ఉపాధ్యాయులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతం కోసం చిన్నారులు ప్రార్థించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని ఆయేషా మాడల్‌ స్కూల్లో చిన్నారి విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారు. రాకెట్ నమూనాను ప్రదర్శిస్తూ జాబిలిపై చేస్తోన్న ప్రయోగం సాఫీగా జరగాలని ప్రార్థించారు. భారత శాస్త్రవేత్తల కృషికి ప్రపంచానికి ఆదర్శం కావాలని, బాల మేధావులకు స్పూర్తి నింపాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల యజమాన్యం, ఉపాధ్యాయ బృందం చిన్నారుల ప్రదర్శనలను అభినందించారు. అదేవిధంగా వారు కూడా మాట్లాడుతూ ఈసారి చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తూ, చంద్రయాన్‌ విజయవంతం కావాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!