ముగిసిన భద్రేశ్వర జాతర ఉత్సవాలు
– ప్రజా ప్రతినిధులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ప్రసిద్ద భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ప్రతి యేడాది దవణ పౌర్ణమి తరువాత ప్రారంభమయ్యే జాతర ఉత్సవాలు రథోత్సవం, లంకాదహన వేడుకల తరువాత రథంపై ఉంచిన కలశం దించడంతో జాతర ఉత్సవాలు ముగించడం ఆనవాయితి. ఈ యేడాది కూడ నిర్వహించిన జాతర ఉత్సవాలలో బుధవారం రథంపై ఉంచిన కలశాన్ని దించి ఉత్సవాలను ముగించారు. జాతర ఉత్సవాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆలయ రెనోవేషన్ కమిటి చైర్మన్ బంటారం సుధాకర్ పలువురు నాయకులను సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్ తదితరులను ఘనంగా సన్మానించారు.


