తెలంగాణ ప‌ట్టిన చీడ కేసీఆర్‌

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

తెలంగాణ ప‌ట్టిన చీడ కేసీఆర్‌
– ఆయ‌న‌ను, కేటీఆర్‌ను బంగాళ‌ఖాతంలో క‌ల‌పాలే
– కేంద్ర‌పై దుష్ప్ర‌చార‌మే సీఎం ల‌క్ష్యం
– సీఎం కేసీఆర్‌ఫై మండిప‌డిన ఈటెల‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ప‌ట్టిన చీడ అని, ఆయ‌న‌ను, మంత్రి కేటీఆర్‌ను బంగాళ‌ఖాతంలో క‌ల‌పాల‌ని బీజేపీ నాయ‌కులు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ అన్నారు. బుధ‌వారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజ‌క‌వ‌ర్గం హైద‌రాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్‌లో జ‌రిగిన బీజేపీ మండ‌ల ప్ర‌శిక్ష‌ణ శిబిరం జ‌రిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఈటెల రాజేంద‌ర్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఏనిమిదేళ్ల క్రితం కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని ఎదురు చూసిన జ‌న‌మే అస‌హ్యించుకుంటున్నారు.

కేంద్రంపై త‌ప్పుడు ప్ర‌చార‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. బీజేపీని బంగాళ‌ఖాతంలో క‌ల‌పాల‌ని అన్న సీఎం కేసీఆర్‌ను, ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ను బంగాళ‌ఖాతంలో క‌ల‌పాల‌న్నారు. వరిధాన్యంపై పోరు చేస్తూ కేంద్రంపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. ఎన్నిక‌ల ముందు, త‌రువాత ఎన్నో హామిల‌ను కేసీఆర్ విస్మ‌రించార‌న్నారు. 57 ఏండ్లకు ఫించ‌న్‌, వింతంతువుల‌కు ఫించ‌న్ అంద‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామ‌ని యువ‌త జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో మ‌ద్యం వ్య‌వ‌స్థ‌తో పేద‌ల‌ను మ‌ద్యానికి బానిస చేసి చావుల తెలంగాణ‌గా మారుస్తున్నార‌ని అన్నారు. మ‌ద్యం వ్యాపారంతో రూ. 30 వేల కోట్ల రాబ‌డి సాధించి అందులోనే రైతుల‌కు రైతుబంధు, క‌ళ్యాణ ల‌క్ష్యీ, షాధీముబార‌క్ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని అన్నారు. పెద్ద రైతుల‌కు రైతు బంధును తొల‌గించి పేద రైతుల‌కు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. రైతుబంధు డ‌బ్బుల‌ను సీఎం కేసీఆర్ త‌న సొంత నిధులతో ఇవ్వ‌డంలేద‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు గుర్తించుకోవాల‌న్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ గ‌డ్డ‌పై టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం బీజేపీ అని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను న‌మ్మె ప‌రిస్థితి లేద‌ని, గ‌తంలో ఓట్లేసి కాంగ్రెస్ నేత‌ల‌కు ఓట్లేసి గెలిపిస్తే టీఆర్ఎస్ చెంత‌కు చేర‌డంతో ఆ పార్టీపై ప్ర‌జ‌ల‌పై న‌మ్మ‌కం పోయింద‌న్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్ కే లాభ‌మ‌నే విష‌యాన్ని గుర్తించుకోవాల‌న్నారు. అదేవిధంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌న్నారు. తెలంగాణ ఏర్పాటైన త‌రువాత ఇక్క‌డి ప్రాంతాల‌కు సాగునీరు అందుతుంద‌నుకుంటే క‌లం సాకారం కాలేద‌న్నారు. చేవేళ్ల ప్రాణ‌హిత‌, పాల‌మూరు – రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుల‌ను సీఎం కేసీఆర్ ఆడ్డుకున్నార‌ని ఆరోపించారు.

ఆత్మ‌గౌర‌వ‌మే గెలిపిస్తుంది
రాజ‌కీయాలు ప‌నికిమాలిన‌వి కాద‌ని, ప్ర‌జ‌ల మేలు కోస‌మే పార్టీలు పుట్టుకొచ్చాయ‌న్నారు. అలాంటి పార్టీల నుంచి నాయ‌కులు ఉద్భవించాలంటే ప్ర‌జ‌ల ఆశీర్వాదం, కార్య‌క‌ర్త‌ల కృషి అవ‌స‌ర‌మ‌న్నారు. హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో ల‌క్ష‌లు వెచ్చించి ద‌ళిత బంధు ప్ర‌వేశ పెట్టిన‌, డ‌బ్బులు పంచిన ప్ర‌జ‌లు ఆత్మ‌గౌర‌వాన్ని గెలిపించార‌నే దానికి నా గెలుపే ఉద‌హార‌ణ అని వివ‌రించారు. గ‌తంలో 1600 ఓట్లు వ‌చ్చిన బీజేపీకి తాను చేరిన త‌రువాత 1 ల‌క్ష 7 వేల ఓట్లు వ‌చ్చాయంటే ప్ర‌జ‌ల‌కు తాను ఇచ్చిన భ‌రోసానే కార‌ణ‌మ‌న్నారు. అలాంటి భ‌రోసాను ప్ర‌జ‌ల‌కు క‌ల్పించాల్సిన బాధ్య‌త నాయకుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఉంద‌న్నారు. బీజేపీని మ‌రింత ప‌టిష్టంగా మార్చాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర నాయ‌కులు వేణు గోపాల్, ర‌ణ‌దీప్, జిల్లా అధ్య‌క్షులు స‌దానందారెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్, రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు నాగారం న‌ర్సింలు, బీజేపి జిల్లా కార్య‌ద‌ర్శులు బంటారం భ‌ద్రేశ్వ‌ర్, బీజేపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు సుద‌ర్శ‌న్ గౌడ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దోమ కృష్ణ‌, సీనీయ‌ర్ నాయ‌కులు పూజారి పాండు, పెద్దేముల్ మండ‌ల అధ్య‌క్షులు సందీప్, తాండూరు మండ‌ల అధ్య‌క్షులు శేఖాపురం ఆంజ‌నేయులు, యాలాల మండ‌ల అధ్య‌క్షులు మ‌హిపాల్, కౌన్సిల‌ర్లు అంతారం ల‌లిత‌, సాహు శ్రీ‌ల‌త‌, పూజా, యాలాల మండ‌ల ఇంచార్జ్ ర‌జ‌నీకాంత్, బీజేవైఎం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

భ‌ద్రేశ్వ‌రిని ద‌ర్శించుకున్న ఈటెల రాజేంద‌ర్
తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌సిద్ద భావిగి భ‌ద్రేశ్వ‌ర స్వామిని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ ద‌ర్శించుకున్నారు. తాండూరుకు ఎమ్మెల్యేగా మొద‌టిసారి వ‌చ్చిన సంద‌ర్భంగా పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి స్వామి దేవాల‌యాన్ని సంద‌ర్శించారు. ఆల‌యంలో వెల‌సిన స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి ద‌ర్శించుకున్నారు.