మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

తాండూరు రాజకీయం వికారాబాద్

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
– పండ‌గ‌ల్లో మ‌త‌సామ‌ర‌స్యం అభినంద‌నీయం
– ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– తాండూరులో ఘ‌నంగా ఈద్ మిలాప్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తుంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేదంర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణం వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో రంజాన్ పండ‌గ‌ను పుర‌స్క‌రించుకుని ఈద్ మిలాప్ ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు హాజర‌య్యారు. ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి విందును స్వీక‌రించారు.
ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందన్నారు. కుల, మత వర్గ భేదం లేకుండా ప్రతి సంవత్సరం ఈద్ మిలన్ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పండ‌గ‌లో మ‌త‌సామ‌రస్య‌త‌ను చాటుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తంరావు, తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), మాజీ ప‌ట్టణ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్‌, మ‌త పెద్ద‌లు అహ‌ద్, ఖుర్షిద్ హుస్సేన్, యూసుఫ్ ఖాన్, టీఆర్ఎస్ నాయ‌కులు ప‌ట్లోళ్ల నర్సింలు, ప‌ట్లోళ్ల సాయిపూర్ బాల్ రెడ్డి, సిద్రాల శ్రీ‌నివాస్, మైనార్టీ నాయ‌కులు హాది, క‌మ‌ల్ అత‌హ‌ర్, బాబ‌ర్, అబ్దుల్ క‌రీం త‌దిత‌రులు పాల్గొన్నారు.