ది గ్రేన్‌ అండ్ సీడ్స్ మర్చంట్స్ కార్యవర్గం సిద్దం

తాండూరు రాజకీయం వికారాబాద్

ది గ్రేన్‌ అండ్ సీడ్స్ మర్చంట్స్ కార్యవర్గం సిద్దం
– అసోసియేషన్ కొత్త అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక
– అధ్యక్షులుగా వెంకట్రాములు గౌడ్, కార్యదర్శిగా పటేల్ కిరణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రు గంజ్ లోని ది గ్రేన్‌ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. సోమవారం తాండూరులోని కార్యాలయంలో అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎస్.వెంకట్రాములు గౌడ్, నూతన ఉపాధ్యక్షులుగా బికుమండ్ల శ్రీధర్, నూతన కార్యదర్శిగా పటేల్ కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా సిహెచ్. భోజిరెడ్డి, కోశాధికారిగా బనకారి కృష్ణ, సభ్యులుగా పటేల్ రాంరెడ్డి, సల్లా దామోదర్, బంటారం సుధాకర్, దినేష్ సింగ్ ఠాకూర్, కట్కం వీరేందర్, మంకాల రవీందర్, రాజేష్ సోని, శంబుని నర్సింలు, జి.మల్లప్పలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్, కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్‌ మాట్లాడుతూ అసోసియేషన్ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. అందరి సహాకారంతో అసోసియేషన్ సభ్యులు, వ్యాపారుల సమస్యల పరిష్కారికి చొరవ చూపుతామన్నారు. మరోవైపు నూతన కార్యవర్గానికి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!