ఆర్‌.కృష్ణ‌య్య ఎంపిక హ‌ర్ష‌ణీయం

జాతీయం తాండూరు రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

 ఆర్‌.కృష్ణ‌య్య ఎంపిక హ‌ర్ష‌ణీయం
– రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎన్నిక‌పై శుభాకాంక్ష‌లు
– రాజ‌కీయ పార్టీల‌కు వెన్నెముక‌లైన బీసీలు
– బీసీల‌ను గుర్తించిన ఏపీ సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు
– బీసీ సంఘం తాండూరు క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రాజ్య‌స‌భ స‌భ్యులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షులు ఆర్.కృష్ణ‌య్య ఎంపిక హ‌ర్ష‌ణీయ‌మ‌ని ఈ సంఘం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ పార్టీ త‌రుపున‌ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక చేసిన సందర్భంగా రాజ్ కుమార్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇందులో భాగంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో ఆర్.కృష్ణయ్యను రాజ్ కుమార్ క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఆయ‌న‌కు పుష్ప‌గుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ సంఘం మీద సీఎం జగన్ చూపిన ప్రేమను మరే సీఎం కూడా చూడలేదన్నారు. ఆర్.కృష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భకు ఎంపిక చేయ‌డంపై కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆర్.కృష్ణ‌య్య పోరాటం ఫ‌లితంతో బీసీలు ఎంతో అభివృద్ధి చెందార‌ని అన్నారు. ప్ర‌స్తుతం అన్ని రాజ‌కీయ పార్టీల‌కు బీసీలు వెన్నెముక‌ల నిలిచారాని పేర్కొన్నారు. అదేవిధంగా గత 47సంవత్సరాల నుండి బీసీ సమస్యలపై జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేస్తూ అనేక మార్లు ఢిల్లీలో, పార్లమెంట్ ముట్టడిలో భాగంగా ఎన్నో కేసులు నమోదు చేసినా కూడా బీసీల పక్షాన ఉంటూ బీసీల కొరకు పోరాడిన మన ఆర్ కృష్ణయ్య గుర్తించలేకపోవడం బాధాక‌ర‌మ‌న్నారు. బీసీల కొరకు చేసే పోరాటంలో భాగంగా ఆర్‌.కృష్ణ‌య్య‌ రాజ్యసభలో తన గొంతుకను బలంగా వినిపించి… బీసీల పక్షాన మరెన్నో పోరాటాలు చేయాలని ఆకాంకక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయ‌కులు యాద‌గిరి యాద‌వ్, రాష్ట్ర నాయకులు సయ్యద్ షూకుర్, నాయ‌కులు లాక్ క్రిష్ణ‌, నీల వెంక‌టేష్, ఉద‌య్‌, బషీరాబాద్ మండ‌ల యూత్ అధ్య‌క్షులు నరేందర్, యాలాల‌ బీసీ యూత్ అధ్యక్షులు లక్ష్మణాచారి, తాండూరు మండల బీసీ యూత్ అధ్యక్షులు బసంత్ కుమార్, పెద్దేముల్ మండల బీసీ యూత్ అధ్యక్షులు బాలు యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.