పార్టీ, ప్రజా అభివృద్ధే ఎమ్మెల్యే ధ్యేయం
– టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ, నియోజకవర్గ ప్రజల అభివృద్ధే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ ధ్యేయమని ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధి 30వ వార్డులో పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా వార్డు నెంబర్ 29లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు అఫ్పూ(నయూం) హాజరై నేతలు, యువకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అఫ్పూ(నయూం) మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో తాండూరు అభివృద్ధి సాధిస్తుందన్నారు. అదేవిధంగా ఆయన నాయకత్వంలో పార్టీ పటిష్టంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఫైయజ్, సలీం, ముంషాద్, అడ్వకేట్ ఫారీద్, అశ్వక్, యువ నాయకులు అబూబాకర్, ఫైజాన్, ముజీబ్, ఆర్పీ, అంగన్వాడీ టీచర్స్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.



