అందరు సేవా గుణాన్ని ప్రదర్శించాలి

తాండూరు వికారాబాద్

అందరు సేవా గుణాన్ని ప్రదర్శించాలి
– ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఆహార పొట్లాల వితరణ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : సమాజంలో ఇతరుల పట్ల అందరు సేవా గుణాన్ని ప్రదర్శించాలని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా గౌరవాధ్యక్షులు బస్వరాజ్, అధ్యక్షులు జైపాల్ రెడ్డిలు అన్నారు. బుధవారం అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గం మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు, బంధువులకు ఆహార పొట్లాలను వితరణ చేశారు. దాదాపు 250 మందికి ఈ ఆహార పొట్లాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి జన్మదినం సందర్భంగా అందించిన సహాకారంతో ఆహార పొట్లాలను అందించడం జరిగిందన్నారు. సమాజంలో అందరు సేవా గుణాన్ని ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి కొంపల్లి రమేష్, జొన్నల వినోద్, రాము, తాండ్ర రమేష్, నరేష్, నరహరి తదితరులు పాల్గొన్నారు.