న‌రేంద‌ర్ గౌడ్ నివాసంలో విషాధం

తాండూరు రాజకీయం వికారాబాద్

న‌రేంద‌ర్ గౌడ్ నివాసంలో విషాధం
– ఆయ‌న మాతృమూర్తి శాంత‌మ్మ క‌న్నుమూత‌
– సానుభూతిని తెలిపిన నేత‌లు, ప్ర‌ముఖులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ మాజీ కౌన్సిల‌ర్ నరుకుల న‌రేంద‌ర్ గౌడ్ నివాసంలో విషాధం నెల‌కొంది. ఆయ‌న మాతృమూర్తి న‌రుకుల శాంత‌మ్మ మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న శాంత‌మ్మ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించడంతో మ‌ధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో న‌రేంద‌ర్ గౌడ్ నివాసంలో విషాదం నెల‌కొంది. ఈవిష‌యం తెలుసుకున్న రాజ‌కీయ పార్టీల నేత‌లు, ప‌ట్ట‌ణ ప్ర‌ముఖులు న‌రేంద‌ర్ గౌడ్ కుటుంబానికి సానుభూతిని ప్ర‌క‌టించారు. న‌రేంద‌ర్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో కొన‌సాగుతుండ‌గా ఆయ‌న స‌తీమ‌ణి సిందూజ గౌడ్ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌గా కొన‌సాగుతున్నారు.