మనోధైర్యం పంచిన మార్వాడీ యువమంచ్
– ఐదు మంది టీబీ రోజులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ
– మూడు నెలులుగా అందిస్తున్న సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: క్షయ వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులకు తాండూరు మార్వాడీ యువమంచ్ మనోధైర్యం అందించింది. శనివారం పట్టణంలోని బాలాజీ మందిరంలో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో 5 మంది టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. మార్వాడి యువమంచ్ సభ్యులు సూర్య ప్రకాష్ సోమాని, సంజయ్ సార్డాల సహాకారంతో రూ. 1500ల విలువైన కిట్లను మంచ్ అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ రాఠీల సమక్షంలో ఐదు మంది బాధతులకు అందజేశారు. గత మూడు నెలులుగా బాధితులకు ఈ పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, క్రమం తప్పకుండా మందులు పౌష్టికాహారం తీసుకుంటే వ్యాధిని జయించవచ్చని బాధితులకు మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంచ్ కోశాధికారి అరుణ్ సార్డా, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

