నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
– హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు
– కోకట్ కాగ్నానది వద్ద భారీ సౌకర్యాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు పేర్కొన్నారు. సమితి సభ్యుల సహాకారంతో యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలోని కాగ్నానదిలో ఈ సారి నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కోక‌ట్ వాగులో నిమ‌జ్జానికి అంగీకారం తెల‌ప‌డం ప‌ట్ల మాజీ ఎంపీపీ క‌ర‌ణం పురుషోత్తం రావు, గ్రామ స‌ర్పంచ్‌, ఎంపీటీసీ, పెద్ద‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హిందూ ఉత్సవ సమితి విజ్ఞప్తి మేరకు కాగ్నానది వద్ద ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో విద్యుత్, మున్సిపల్, ఫైర్ శాఖల సహాకారంతో నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనివిని ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు బోయరాజు, వెంకన్న గౌడ్, రాము, అశోక్ తదితరులు ఉన్నారు.