కర్ణాటకలో కరెంట్ జగడం..!

క్రైం జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

కర్ణాటకలో కరెంట్ జగడం..!
– బాకీ వసూలుకు వెళ్లిన లైన్‌మెన్‌కు చుక్కెదురు
– లైన్‌మెన్‌పై చెప్పుతో దాడి చేసిన వినియోగదారుడు
– సోషల్ మీడియాలో వీడీయో వైరల్‌
దర్శిని డెస్క్‌: చారిత్రాత్మక విజయంతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కరెంట్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు హామీలలో తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. అసలు సమస్య మొదలైంది. ఊర్లలో కరెంటు బిల్లులు చెల్లించేందుకు ప్రజలు నిరాకరిస్తుండటంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. తాజాగా.. కరెంటు బిల్లు చెల్లించాలని వెళ్లిన లైన్‌మెన్ పై ఓ వ్యక్తి చేశాడు. కొప్పాల్‌లోని కూకనపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ హిరేమఠ్ అనే వ్యక్తి పేరిట ఆరు నెలలకు రూ.9990 కరెంటు బిల్లు వచ్చింది. ఈ నేపథ్యంలో బాకీ చెల్లించాలని చంద్రశేఖర్‌ ఇంటికి లైన్ మెన్ మంజునాథ్‌ వెళ్లాడు. ఈ సమయంలో చంద్రశేఖర్ తన బకాయిలు చెల్లించనని స్పష్టంచేశాడు. బకాయిలు చెల్లించాలంటూ లైన్‌మెన్ మంజునాథ్ కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన చంద్రశేఖర్.. లైన్‌మెన్ మంజునాథ్‌పై చెప్పుతో దాడి చేసి అసభ్యకరంగా తిట్టాడు. మంజునాథ్‌పై దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

దీంతో మునీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మంజునాథ్‌పై దాడి చేసిన చంద్రశేఖరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత అధికారి ఫిర్యాదు మేరకు.. నిందితుడు చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని జెస్కాం సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొప్పల్ జిల్లా కరటగి తాలూకా జమాపురా గ్రామస్థులు ఇంతకుముందు ఇదే కరెంట్ బిల్లు కట్టమంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కరెంటు బిల్లు కట్టేదేలేదంటూ తేల్చి చెప్పారు. కావాలంటే కమర్షియల్ మీటరుకు మాత్రమే బిల్లు అడగాలని లైన్‌మెన్‌తో చెప్పారు. అంతేకాకుండా.. తరచూ తమవద్దకు వచ్చి అడగొద్దంటూ బిల్ కలెక్టర్‌ను హెచ్చరించారు. తరచూ ప్రజలకు, విద్యుత్ శాఖ అధికారుల మధ్య గొడవలు జరుగుతుండటం పెద్ద తలనొప్పిగా మారింది. మొన్నటిదాకా జస్ట్ వాగ్వాదమే.. ఇప్పుడు ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చి.. దాడి చేసే స్థాయికి వెళ్లడంతో ఈ సమస్య చర్చనీయాంశంగా మారింది. వీడియో కింద ఉంది చూడండి..

ఇది కూడా చదవండి…
తాండూరుకు పీఆర్ ఈఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– ఫలించిన సునీతామహేందర్ రెడ్డి ప్రయత్నం
https://dharshininews.com/17321

chaithany collage