ఆడబిడ్డలకు సర్కారు కానుక

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆడబిడ్డలకు సర్కారు కానుక
– బతుకమ్మ చీరలతో పండగ సంతోషంగా జ‌రుపుకోవాలి
– అంతారంలో చీరలు పంపిణీ చేసిన సర్పంచ్, ఎంపీటీసీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం దసరా పండగ సందర్భంగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తోందని తాండూరు మండలం అంతారం గ్రామ సర్పంచ్ రాములు, ఎంపీటీసీ శాంతులు అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాములు, ఎంపీటీసీ శాంతులు హాజరై మహిళలకు చీరలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్ర‌తియేడాది 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా చీరలను అందజేస్తుందన్నారు. ఈ సారికూడ అంద‌జేసిన ఈ చీరలను మ‌హిళ‌లు కట్టుకుని బతుకమ్మ, దసరా పండగను సంతోషంగా జరుపుకొ వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఇస్మాయిల్, ఉప సర్పంచ్ జీవరత్నం, రేషన్ డీలర్ ప్రకాష్, టీఆర్ఎస్ నేతలు మడుగుల సాయిలు, కోళ్ల చిట్టెప్ప, జంగని మొగులప్ప, జంగని బాలప్ప, పంచాయతీ కారోబార్ రాజు, మహిళలు పాల్గొన్నారు.