జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం..!
– రెండేళ్లలో జర్నలిస్టులకు ప్రత్యేక టవర్స్‌
– తాండూరులో ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటుకు కృషి
– టీయూడబ్ల్యూజే-ఐజేయూ తృతీయ మహాసభలను జయప్రదం చేయండి
– రాష్ట్ర కమిటి సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సీనీయర్ జర్నలిస్టు పట్లోళ్ల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు.

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని అలంపల్లి రోడ్డులో ఉన్న సత్యభారతి ఫంక్షన్‌ హాల్‌లో జరగనున్న మహాసభల నేపథ్యంలో శుక్రవారం తాండూరు నియోజకవర్గ టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. డివిజన్‌ అధ్యక్షుడు పెరుమాళ్ల వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10న వికారాబాద్‌లో నిర్వహించనున్న యూనియన్‌ తృతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అవకాశం కల్పిస్తే జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు.
వచ్చే రెండేళ్లలో జర్నలిస్టులందరికీ ప్రత్యేక టవర్స్‌ ఏర్పాటు చేయించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. తాండూరులో ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటుకు ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. ఏ జర్నలిస్టుకు సమస్య ఎదురైనా, ఆపద వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. యూనియన్‌లో భేదాభిప్రాయాలకు తావులేకుండా ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

జిల్లాలో అత్యధిక యూనియన్‌ సభ్యత్వం కలిగిన తాండూరు జర్నలిస్టులు ఐక్యంగా నిలిచి జిల్లా అధ్యక్ష పదవి తాండూరుకు దక్కేలా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అంతకుముందు డివిజన్‌ అధ్యక్షుడు పెరుమాళ్ల వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణలు మాట్లాడితూ మహాసభలో తాండూరు జర్నలిస్టుల సత్తా చాటాలని, జిల్లా అధ్యక్ష పదవి తాండూరుకే దక్కేలా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్‌ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు వెంకటేశం (వాసు), తాండూరు పట్టణంతో పాటు తాండూరు, పెద్దేముల్‌, బషీరాబాద్‌, యాలాల మండలాలకు చెందిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

బీసీ యువకెరటం.. ఈడిగ శ్రీనివాస్ గౌడ్..!