రండి రక్తదానం చేయండి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

రండి రక్తదానం చేయండి
– రేపు తాండూరులో మెగా రక్తదాన శిబిరం
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: సమాజ సేవకు కృషి చేసే పోలీసులు సామాజిక సేవకు సిద్దమయ్యారు. రండి రక్తదానం చేయండి అని తాండూరు పట్టణ పోలీసులు పిలుపునిచ్చారు. తాండూరులో రేపు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని సమద్ ఫంక్షన్‌ హాల్‌లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి రక్తదాన శిబిరం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, యువకులు, నాయకులు తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.