శోభాయమానంగా పల్లకి సేవ..!
– సాయిపూర్ లో వైభవంగా శ్రావణ మాసం భజన సమాప్తి ఉత్సవాలు
– అభిషేకాలు చేసిన చైర్ పర్సన్ దంపతులు
– ఊరేగింపులో పాల్గొన్న పెద్దలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లో ఆంజనేయ స్వామి పల్లకి సేవ శోభాయమానంగా కొనసాగింది.

శుక్రవారం, శనివారం ప్రసన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం భజన సమాప్తి ఉత్సవాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం దేవాలయంలో స్వామి వారికి మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి దంపతులు అభిషేకం చేశారు.

అనంతరం దేవాలయం నుంచి స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు నిర్వహించారు. పట్లోల్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంటు మల్లప్ప, కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్, సాయిపూర్ పెద్దలు, యువకులు, భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో భజన కీర్తనలు ఆకట్టుకున్నాయి.

దేవాలయ నుంచి ప్రారంభమైన ఊరేగింపు శోభాయమానంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరువు, కష్టాలు రాకుండా అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. మరోవైపు సాయిపూర్ లో ప్రసన్న అభయాంజనేయ స్వామి భజన సమాప్తి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభను నింపింది.


