ఈ యేడాది చివరి చంద్రగ్రహణం

ఆరోగ్యం జాతీయం టెక్నాలజీ తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

ఈ యేడాది చివరి చంద్రగ్రహణం
– ఎంత గంటలు ఉంటుందో తెలుసుకోండి
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా శ్రీ శుభకృత్ నామ సంవత్సరం కార్తిక పౌర్ణమి భరణి నక్షత్రంలో (నవంబర్‌ 8న) రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అంటే మంగళవారం ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం దర్శనమిస్తోంది. ఈ ఏడాది ఏర్పడిన మొత్తం నాలుగు గ్రహణాలు.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే కనిపించడం విశేషం. సూర్యగ్రహణం ఏర్పడిన పదిహేను రోజుల గ్యాప్‌లోనే చంద్రగ్రహణం ఏర్పడడం గమనార్హం. ఇవాళ్టి సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌తోపాటు పలుదేశాల్లో కనిపించనుంది. ఈ ఏడాది చివరగా సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.30 కొనసాగనుంది. ఈ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ఫసిఫిక్‌, హిందుమహా సముద్ర ప్రాంతాల్లో సంపూర్ణంగా కనిపించనుండగా.. హైదరాబాద్‌తో పాటు కొన్ని నగరాల్లో అది పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో చంద్ర గ్రహణం సాయంత్రం 5.40కు ప్రారంభమై 7.26 గంటలకు ముగుస్తుంది. గంట 46 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని జి.పి.బిర్లా ఆర్కియలాజికల్‌ ఆస్ట్రోనామికల్‌ అండ్‌ సైంటిఫిక్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(జీపీబీఏఏఎస్‌ఆర్‌ఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ 2025 మార్చి 14న ఏర్పడనుందని ఖగోళ పరిశోధకులు తెలిపారు.