ముద్దాయిపేట ఎల్లమ్మ కృప అందరిపై ఉండాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ముద్దాయిపేట ఎల్లమ్మ కృప అందరిపై ఉండాలి
– అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: శ్రీ రేణుక ఎల్లమ్మ కృప భక్తులు, ప్రజలపై ఉండాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్‌ పటేల్ అమ్మవారిని వేడుకున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయిపేట గ్రామంలో కొనసాగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలకు రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయంలో వెలసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శుభప్రద్ పటేల్ గారు మాట్లాడుతూ.. ఎల్లమ్మ మాతను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలు, రైతులు, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, అమ్మవారి కృప అందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎల్లమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు శుభప్రద్ పటేల్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణయ్య గౌడ్, మాజీ సర్పంచ్ బిచ్చయ్య గౌడ్, వినోద్ కుమార్ నాయకులు సురేష్, వెంకటయ్య గౌడ్, బస్వరాజు, శివ కుమార్, అశోక్ మల్లేష్ ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.