నిరుద్యోగులకు సర్కారు తీపికబురు

కెరీర్ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

నిరుద్యోగులకు సర్కారు తీపికబురు
– 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌
– ఏయే పోస్టులను భర్తి చేయనుందంటే

హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలతో భాగంగా ప్రకటించిన గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌-4కు సంబంధించి 9,168 గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. భర్తి చేయనున్న ఉద్యోగాలలో అత్యధికంగా 6,859 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా రెవెన్యూ శాఖలో 2,077 జూనియన్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.