కుర్‌కురే ప్యాకెట్లో 500 నోట్లు..!

జాతీయం తెలంగాణ హైదరాబాద్

కుర్‌కురే ప్యాకెట్లో 500 నోట్లు..!
– ఎగబడిన పిల్లలు, తల్లిండ్రులు
– ఎంతవరకు దొరికాయో తెలిస్తే షాక్
దర్శిని డెస్క్‌: పిల్లలు అమితంగా ఇష్టపడి తినే కుర్‌కురే ప్యాకెట్లు లక్షీ కటాక్షం కల్పించాయి. ఒక్కో ప్యాకెట్లలో రూ. 500 నోట్లు దర్శనమిచ్చాయి. ఒక దాంట్లో వస్తే మామూలుగా వచ్చింటాయని భావించినా.. మరో దాంట్లో కూడ రావడంతో పిల్లలు, తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంకేముందే పిల్లలు, పెద్దలు బారులు తీరి కుర్‌కురే ప్యాకెట్లను కొనుగోలు చేశారు. ఈ ఆసక్తికర సంఘటన కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. వివరాల్లోకి వెళితే… రాయచూర్ జిల్లా లింగసుగూర్ తాలూకా హునూర్ గ్రామంలో చిన్నారుల కుర్ కురే ప్యాకెట్ లో 500 రూపాయల నోట్లు బయటపడ్డాయి. ఐదు రూపాయలు, రెండు రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఒక్కో కుర్‌కురే ప్యాకెట్‌లో 5-6 నోట్లు దొరికాయి. కొందరికి రెండు మూడు నోట్లు కూడా వచ్చాయి. ఇలా వివిధ ప్యాకెట్లలో సుమారు 20 వేల వరకు డబ్బు దొరికింది. గత నాలుగైదు రోజులుగా హూనూరు గ్రామంలోని కొన్ని దుకాణాల్లో కొనుగోలు చేసిన కుర్ కుర్ ప్యాకెట్లలో డబ్బులు దొరుకుతున్నాయనే విషయం ఆ చుట్టు పక్కల గ్రామాలకు దావానంలా వ్యాపించింది. దీంతో కుర్‌కురే కొనుగోళ్లతో దుకాణాలు ఖాళీ అయిపోయాయి. అయితే నాలుగైదు రోజులుగా దొరికిన నోట్లు నకిలీనోట్లా.. అసలైన నోట్లా అనే విషయంలో గందరగోళం నెలకొంది. మరోవైపు ఒక్కరోజునే బస్తాల కొద్దీ కుర్‌కురే ప్యాకెట్లు అయిపోవటంతో ఆ వెంటనే దుకాణదారులు కొత్త స్టాక్ తీసుకొచ్చారు. కానీ, వాటిలో నోట్లు కనిపించలేదని తెలిసింది. ఇటీవల కుర్ కురే కొనుగోలు చేసిన వారికి నిరాశే ఎదురైంది.