టేకాఫ్ కాగానే టైరు ఊడింది..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

టేకాఫ్ కాగానే టైరు ఊడింది..!
– అయినా సేఫ్‌గా లాండైన కార్గో విమానం
– సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్
ద‌ర్శిని డెస్క్: ప్ర‌పంచంలోనే అతిపెద్ద కార్గో విమానం బోయింగ్ 747-400 డ్రీమ్ లైనర్ విమానానికి ప్ర‌మాదం జ‌రిగింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దాని టైరు ఊడి కిందపడింది. ఈ విష‌యాన్ని బోయింగ్ సంస్థ దృవీక‌రించారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. వివ‌రాల్లోకి వెళితే.. యూఎస్ కార్గో ఎయిర్‌లైన్ అట్లాస్ ఎయిర్ సంస్థ ప్ర‌పంచంలోనే అతిపెద్ద కార్గో విమానం బోయింగ్ 747-400 డ్రీమ్ లైనర్ విమానాన్ని నిర్వహిస్తోంది. ఇట‌లీలోని టొరంటో-గ్రోటాగ్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండ‌గా ల్యాండింగ్ గేర్ నుంచి వీల్ అసెంబ్లింగ్‌ను కోల్పోయి క్షణాల్లోనే 100 కేజీల బరువుండే విమానం టైరు ఊడి కిందపడింది. అయితే ఆ తర్వాత విమానం చార్లెస్టన్అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని బోయింగ్ సంస్థ తెలిపింది. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి బ్రెజిల్‌కు చెందిన ఏవియేషన్ బ్లాగ్ ఏరోయిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన‌ ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విమానం నుంచి ఊడిన టైరును ఎయిర్‌పోర్టు శివార్లలో క‌నుగొన్నారు.