అల్మాస్ స్కూల్ కు అవార్డు పంట
– తైక్వాండో చాంపియన్ షిప్ లో విద్యార్థికి బంగారు పతకాలు
– స్పోర్ట్స్ బెస్ట్ స్టూడెంట్, టీచర్ అవార్డులతో సత్కారం
– అభినందించిన అల్మాస్ స్కూల్ యజమాన్యం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అల్లాపూర్ గ్రామ సమీపంలోని అల్మాస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు అవార్డు పంట వరించింది. తైక్వాండో చాంపియన్ షిఫ్లో స్కూల్ విద్యార్థి బంగారు పథకాలు సాధించాడు. దీంతో విద్యార్థికి స్పోర్ట్స్ బెస్ట్ స్టూడెంట్, స్కూల్ టీచర్ కు స్పోర్ట్స్ బెస్టు టీచర్ అవార్డులు దక్కాయి.

వివరాల్లోకి వెళితే.. గత యేడాది డిసెంబర్ 28న బెంగలూరులో నిర్వహించిన ఏఓటీ 3థర్డ్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ పోటీలో స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మహమ్మద్ నోమాన్ అండర్-15 విభాగంలో పాల్గొన్నారు. క్యోరూగి, పూమ్ సే విభాగాలలో నోమాన్ ప్రతిభను కనబరిచి రెండు విభాగాలలో రెండు బంగారు పతకాలను సాధించాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర లగోరి అసోసియేషన్ ఆధ్వర్యంలో 2017-23 సంవత్సరానికి గాను నిర్వహించిన ఉత్తమ అవార్డులకు విద్యార్థి నోమాన్ తో పాటు స్కూల్ టీచర్ బేగం పర్హానాలు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమావేశంలో అల్మాస్ స్కూల్ విద్యార్థి నోమాన్ స్పోర్ట్స్ బెస్ట్ స్టూడెంట్ అవార్డు, స్కూల్ పీఈటీ టీచర్ బేగం పర్హానా స్పోర్ట్స్ బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు. దీంతో అల్మాస్ స్కూల్ యజమాన్యం, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు వారిని అభినందించారు. మరోవైపు అవార్డులు సాధించిన అల్మాస్ స్కూల్ యాజమాన్యానికి విద్యార్థికి బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాసన్ పటేల్ అభినందనలు తెలిపారు.

