వీఎన్ గౌడ్ నివాసంలో సంక్రాంతి సందడి
– బసవణ్ణ పూజలో నిర్వహించిన కుటుంబ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్, సీనీయర్ నాయకులు విశ్వనాథ్ గౌడ్(వీఎన్) నివాసంలో సంక్రాంతి సందడి నెలకొంది. సంక్రాంతి పర్వదినాన ఇంటికి వచ్చిన బసవణ్ణకు విశ్వనాథ్ గౌడ్‌తో పాటు సతీమణి శారధ, కుమారుడు సోమనాధ్ గౌడ్‌తో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు, నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండగ ఎంతో విశిష్టమైనది అన్నారు. పండగలో పాటించే సంప్రదాయాలతో శాస్త్రీయత కూడ దాగుందని, వాటిని పాటించడం వల్ల సుఖఃసంతోషాలు వెల్లివిరుస్తాయన్నారు. పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరి హరగౌడ్, రైతు సంఘం నాయకులు సుభాన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

