రూ. 18 వేలకే కొత్త ల్యాప్‌ట్యాప్‌

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

రూ. 18 వేలకే కొత్త ల్యాప్‌ట్యాప్‌
– రూ. 52 వేల ధరలో 63 శాతం తగ్గింపు
– ప్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్‌
దర్శిని డెస్క: అవును మీరు చదవింది నిజమే. కొత్త ల్యాప్‌ట్యాప్‌ కొనాలనుకునే వారికి ఇది గొల్డెన్‌ చాన్స్‌. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 52 వేల విలువైన ల్యాప్‌ట్యాప్‌ను 63 శాతం తగ్గింపుతో రూ. 18 వేలకే అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సూపర్ ఆఫర్ డీల్ అందుబాటులో ఉంది. అది ఏదో సెకండ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌లపై కానే కాదు. లెవొవొ కంపెనీకి చెందిన Lenovo Athlon Dual Core 3050U ల్యాప్‌టాప్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల హెచ్‌డీ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే ఉంది. స్టైలిష్ అండ్ పోర్టబుల్ థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ ఇది. ఇందులో ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ ఉండదు. ఇంకా ఇందులో 4 జీబీ సిస్టమ్ మెమరీ, ఎస్ఎస్‌డీ టైప్, 0.3 మెగాపిక్సల్ కెమెరా, ఏ3050యూ ప్రాసెసర్, 45 డబ్ల్యూహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 11 గంటల బ్యాటరీ లైఫ్, ఇంటిగ్రేటెడ్ ఏఎంబీ గ్రాఫిక్స్, టీపీఎం 2.0, కెన్సింగ్టన్ లాక్ స్లాట్, ఫుల్ సైజ్ కీబోర్డు, టూ బటన్ టచ్ ప్యాడ్, ఒక యూఎస్‌బీఐ 2.0 పోర్ట్, ఒక యూఎస్‌బీఐ 3.1 పోర్ట్, యూఎస్‌బీ టైప్ సీ, ఒక హెచ్‌డీఎంఐ పోర్ట్, ఒక ఇథర్‌నెట్ పోర్ట్, ఆడియో కాంబో జాక్, 4 ఇన్ 1 కార్డ్ రీడర్ వంటి పలు ఫీచర్లు ఈ ల్యాప్ టాప్‌లో ఉన్నాయి. ఈ లెనొవొ ల్యాప్‌టాప్‌పై అసలు ఎంఆర్‌పీ రేటు రూ. 52,414గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు కేవలం రూ. 18,990కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ ల్యాప్‌టాప్‌పై ఇంకా అనేక ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేస్తే రూ. 950 డిస్కౌంట్ వస్తుంది. అంటే అప్పుడు మీరు ఈ ల్యాప్ టాప్‌ను కేవలం రూ. 18 వేలకు సొంతం చేసుకోవచ్చు.