‘కొంగ’త్త స్నేహం..!
– ఎగిరే పక్షికి మనిషితో బంధం
– ఎక్కడికెళ్లినా వెంటే ప్రయాణం
– వైరల్ అవుతున్న వీడీయో
దర్శిని డెస్క్: మనషులు ఎవరు ఎవరితో అయినా స్నేహం చేయొచ్చు. జంతువులు, పక్షులతో స్నేహబంధం ఏర్పరుచుకుంటారు. కాని తనంటతానే ఓ కొంగ మనిషితో స్నేహం చేస్తోంది. భూమిపై అతను ఎక్కడికి వెళ్లినా.. ఆకాశంలో ఎగురుతూ వెంటే ప్రయాణం చేస్తోంది. ఈ కొంగొత్త స్నేహంకు అందరు ఫిదా అవుతున్నారు. వారి స్నేహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మామూలుగానైతే మనుషులను చూడగానే కొంగలు ఎగిరిపోతాయి. మనిషి వల్ల ఎక్కడ తమ ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందోనని అవి భయపడటమే దీనికి కారణం. అందుకే మనిషి దగ్గరికి వస్తున్నాడు అనుకుంటే చాలు అవి అలర్ట్ అయిపోతాయి. కానీ అసాధారణ రీతిలో ఓ భారీ నీటి కొంగ మాత్రం ఓ వ్యక్తితో స్నేహం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథికి చెందిన ఆరిఫ్ ఓ రోజు పొలం వద్దకు వెళ్లగా అతడికి గాయపడిన ఒక భారీ కొంగ కనిపించింది. దీంతో అతడు ఆ కొంగను ఇంటికి తీసుకెళ్లాడు. దాని ఆరోగ్యం బాగయ్యేంతవరకు సపర్యలు చేస్తూ వచ్చాడు. నిదానంగా ఆ కొంగ కోలుకుంది. ఇక ఆ కొంగ ఎగిరిపోతుందని ఆరిఫ్ భావించాడు. అయితే ఆ కొంగ ఇల్లు విడిచి వెళ్ళలేదు. ఆరిఫ్ ఎక్కడికి వెళ్ళినా సరే అతడి వెంట వెళ్లడం ప్రారంభించింది. కొంగ, యువకుడి మధ్య ఏర్పడ్డ బంధంపై కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది ‘కొంగ’త్త స్నేహం అంటూ కామెంట్లు కూడ పెడుతున్నారు. వీడీయో కోసం కింద క్లిక్ చేయండి..
https://www.instagram.com/reel/CpGA1LrL27H/?igshid=YmMyMTA2M2Y=

