గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు

కెరీర్ తెలంగాణ హైదరాబాద్

గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు
– దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ఎంజేపీటీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌
– అర్హత, ప్రవేశ తేది పరీక్షలు ఎప్పుడంటే
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కాలేజీలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మ‌హాత్మాజ్యోతిబాపులే తెలంగాణ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ద్వారా రాష్ట్రంలోని వివిధ జూనియ‌ర్ క‌ళాశాల‌లు, డిగ్రీ క‌ళాశాల‌ల్లో 2023-2024 విద్యా సంవ‌త్సరానికిగాను ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ప్రవేశ ప‌రీక్ష ఆధారంగా ఇంటర్మీడియ‌ట్‌, డిగ్రీ మొద‌టి ఏడాదిలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీ సెట్‌-2023కు సంబంధించి జూనియర్‌ కళాశాలల్లో (ఇంగ్లిష్‌ మీడియం) మొత్తం-255 (బాలురు-130, బాలికలు-125) దరఖాస్తులను కోరుతోంది. ఇంట‌ర్‌లో (ఇంగ్లిష్ మీడియం): ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఇతర వృత్తి విద్యా కోర్సులు ఉంటాయని తెలిపారు. ఇందుకు 10వ తరగతి/ ఎస్‌ఎస్‌సీ చదువుతున్నవారు అర్హులని తెలిపింది. అదేవిధగా మహిళా డిగ్రీ కళాశాలలు-14 (ఇంగ్లిష్‌ మీడియం) మహిళలు-06, పురుషులు-08 గాను ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నవారు అర్హతలతో దరఖాస్తులను కోరుతోంది. ప్రవేశ ప‌రీక్షలో ప్రతిభ‌, రిజ‌ర్వేష‌న్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపింది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాని, ఇందుకు ఫీజు రూ. రూ.200 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 16వ తేది వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, 20వ తేది నుంచి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. 29వ తేదిన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

డిగ్రీలో కళాశాలలు అందిస్తున్న కోర్సులు:
1. బీఎస్సీ ఫిజికల్‌ సైన్సెస్‌: ఎంపీసీ, ఎంసీసీఎస్‌, ఎంఎస్‌సీఎస్‌, ఎంఎస్‌డీఎస్‌, ఎంఎస్‌ఏఐ అండ్‌ ఎంఎల్‌, ఎంపీజీ, ఎంఈఎస్‌ అండ్‌ ఎంఈసీఎస్‌.
2. బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌: బీజెడ్‌సీ, బీజెడ్‌జీ, బీబీసీసీ, బీటీబీసీసీ, బీటీజెడ్‌సీ, ఎంబీజెడ్‌సీ, ఎంబీజెడ్‌సీ, ఎన్‌జెడ్‌సీ అండ్‌ ఏఎన్‌పీహెచ్‌బీసీ.
3. బీకామ్‌: జనరల్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌.
4. బీఏ: ఈపీహెచ్‌, హెచ్‌పీఈ, ఐఆర్‌ఈపీ, పీపీజీఈపీ.
5. బీబీఏ, 6. బీఎఫ్‌టీ.