టాప్ లేపిన కేవీసీఎస్..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

టాప్ లేపిన కేవీసీఎస్..!
– రెండు 10/10 జీపీఏ సాధించిన ఏకైక స్కూల్
– 9.8 జీపీఏలతో మరో ఇద్దరి హావా
– ముగ్గురికి 9.7 జీపీఏ మార్కులు
– స్కూల్లో వంద శాతం ఉత్తీర్ణత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాల(కేవీసీఎస్) టెన్త్ ఫలితాల్లో టాప్ లేపింది. పాఠశాలకు చెందిన విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభతో విజయకేతనం ఎగురవేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతను సాధించారు. పాఠశాలకు చెందిన ఈడిగి అభీఘ్న- 10/10 జీపీఏ, కొత్త ప్రార్థివ్ – 10/10 జీపీఏలు సాధించారు. దీంతో తాండూరులో 10/10 జీపీఏ సాధించిన ఏకైక పాఠశాలగా కేవీసీఎస్ చరిత్ర సృష్టించింది. అదేవిధంగా పాఠశాలకు చెందిన కందూరి వర్షిత – 9.8 జీపీఏ, నల్ల చందన – 9.8 జీపీఏ సాధించగా గంజిపల్లి శ్రీనివాస్ – 9.7 జీపీఏ, ఉరుముగిద్ద వీణ – 9.7 జీపీఏ, అలత్ భాగ్యశ్రీ – 9.7 జీపీఏలు సాధించి సత్తా చాటారు. అంతేకాకుండా మిగతా విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల మొత్తంగా పది ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై పాఠశాల యజమాన్యం, కరస్పాండెంట్ వెంకటేశంలతో పాటు ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు కేవీసీఎస్ ఎల్లప్పుడు కృషి చేస్తుందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో గుణాత్మక విద్యనందించేందుకు చేసిన కృషి ఫలించడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ పేరొన్నారు.

ఇది కూడా చదవండి…

ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..!
– ఉన్మాది దాడిలో మరో నలుగురికి గాయాలు
– కేరళలో చోటు చేసుకున్న దారుణం
– సుమోటోగా తీసుకున్న హుమన్ రైట్స్ కమీషన్
– తీవ్ర సంచలనమైన ఘటన
https://dharshininews.com/17082