గ్రంథాలయాల అభివృద్ధికి సహకించండి
జిల్లా కలెక్టర్ నిఖిలను కోరిన లైబ్రరీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాజీపూర్ మురళీకృష్ణగౌడ్ కోరారు. గురువారం జిల్లా నూతన కలెక్టర్ నిఖిలను గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఇందుకు జిల్లా కలెక్టర్ నిఖిల స్పందించి జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపినట్లు మురళీకృష్ణగౌడ్ తెలిపారు. గ్రంథాలయాలు అంటే తనకు మక్కువ ఉన్నట్లు కలెక్టర్ తెలిపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ ఉన్నారు.

