సర్కారుకు పేరు పెంచిన సేవలు మీవి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సర్కారుకు పేరు పెంచిన సేవలు మీవి..!
– ఉప్పల శ్రీనివాస్ గుప్తను కలిసిన రొంపల్లి సంతోష్‌ కుమార్
– మరిన్న ఉన్నత పదవులు చేపట్టాలని శుభాకాంక్షలు
తాండూరు, దర్శినిప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర టూరిజం అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త సర్కారుకు మంచి పేరుతెచ్చే సేవలందించారని తాండూరు బీఆర్ఎస్ యువనాయకులు, వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త అన్నారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్‌గా సేవలందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త పదవి కాలం ఇటీవలే ముగిసింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ఉప్పల శ్రీనివాస్ గుప్తను రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త మర్యాదపూర్వకంగా కలిశారు. టూరిజం చైర్మన్‌గా రెండు సంవత్సరాలు విజయంవంతంగా బాధ్యతను నిర్వహించి సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడమే కాకుండా ఉత్తమ సేవలు అందించడం అభినందనీయమని అన్నారు.

చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీర్ గారికి, టూరిజం శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చినందుకు వైశ ఫెడరేషన్ తరుపునుండి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజులో మీరు ఇంకా పెద్ద పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఉప్పల శ్రీనివాస్ గుప్తకు శాలువా కప్పి.. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.