గురుకుల డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో ఉద్యోగాలు

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

గురుకుల డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో ఉద్యోగాలు
– 2,008 జూనియర్ లెక్చరర్‌ పోస్టులు
– 868 డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
– అర్హులు, దరఖాస్తు గడువు ఎప్పటి వరకు అంటే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో లెకర్చర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, ల్రైబ్రేరియన్‌ పోస్టులను డైరెక్ట్ పద్దతిన పోస్టులను భర్తి చేస్తున్నట్లు ప్రకటించింది. డిగ్రీ కళాశాలల్లో.. డైరెక్ట్‌ ప్రాతిపదికన 868 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరగా.. జూనియర్ కళాశాలల్లో 2,008 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ కాలేజీల్లో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్‌, కామర్స్‌, పొలిటికల్ సైన్స్, జర్నలిజం తదితర సబ్జెక్టుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జూనీయర్ కాలేజీల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్‌, కామర్స్‌ తదితర సబ్జెక్టుల్లో ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీపీఈడీ, బీపీఈ, ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2023వ తేదీనాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలని స్పష్టం చేసింది. మే 17, 2023వ తేదీలోపు ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.600లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్షలు(పేపర్-1, 2, 3), డెమాన్‌స్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి డిగ్రీ కళాశాల లెక్చర్లకు నెలకు రూ.58,850ల నుంచి రూ.1,37,050ల వరకు జీతంగా చెల్లించనుండగా జూనియర్ కళాశాల లెక్చర్లకు నెలకు రూ.54,220ల నుంచి రూ.1,33,630ల వరకు జీతంగా చెల్లించడం జరుగుతుందని తెలిపింది.

జూనియర్ కళాశాలలో.. పోస్టుల వివరాలు..
ఫిజికల్ డైరెక్టర్: 34 పోస్టులు
లైబ్రేరియన్: 50 పోస్టులు
జేఎల్‌ సబ్జెక్టు వారీగా ఖాళీలు..
తెలుగు సబ్జెక్టు పోస్టులు: 225
హిందీ సబ్జెక్టు పోస్టులు: 20
ఉర్దూ సబ్జెక్టు పోస్టులు: 50
ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టులు: 230
మ్యాథ్స్‌ సబ్జెక్టు పోస్టులు: 324
ఫిజిక్స్ సబ్జెక్టు పోస్టులు: 205
కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టులు: 207
బోటనీ సబ్జెక్టు పోస్టులు: 204
జువాలజీ సబ్జెక్టు పోస్టులు: 199
హిస్టరీ సబ్జెక్టు పోస్టులు: 7
ఎకనామిక్స్ సబ్జెక్టు పోస్టులు: 82
కామర్స్‌ సబ్జెక్టు పోస్టులు: 87
సివిక్స్‌ సబ్జెక్టు పోస్టులు: 84

డిగ్రీ కళాశాలలో ఖాళీల వివరాలు..
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు: 39 పోస్టులు
లైబ్రేరియన్ పోస్టులు: 36 పోస్టులు
డిగ్రీ లెక్చరర్ సబ్జెక్టు వారీగా ఖాళీలు..
తెలుగు సబ్జెక్టు పోస్టులు: 55
ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టులు: 69
మ్యాథ్స్‌ సబ్జెక్టు పోస్టులు: 62
స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టు పోస్టులు: 58
ఫిజిక్స్ సబ్జెక్టు పోస్టులు: 46
కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టులు: 69
బోటనీ సబ్జెక్టు పోస్టులు: 38
జువాలజీ సబ్జెక్టు పోస్టులు: 58
కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు పోస్టులు: 99
జియాలజీ సబ్జెక్టు పోస్టులు: 6
బయో కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టులు: 3
బయో టెక్నాలజీ సబ్జెక్టు పోస్టులు: 2
హిస్టరీ సబ్జెక్టు పోస్టులు: 28
ఎకనామిక్స్ సబ్జెక్టు పోస్టులు: 25
పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు పోస్టులు: 27
కామర్స్‌ సబ్జెక్టు పోస్టులు: 93
జర్నలిజం సబ్జెక్టు పోస్టులు: 2
సైకాలజీ సబ్జెక్టు పోస్టులు: 6
మైక్రోబయాలజీ సబ్జెక్టు పోస్టులు: 17
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టు పోస్టులు: 9
సోషియాలజీ సబ్జెక్టు పోస్టులు: 7
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టు పోస్టులు: 14