గుండెపోటుతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గుండెపోటుతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి
– తాండూరు పట్టణంలో ఘటన
– నివాళులర్పించిన ఫోటోగ్రాఫర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెళ్లి వేడుకల్లో ఫోటోలు తీసేందుకు వెళ్లిన ఫోటోగ్రాఫర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
తాండూర్ మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు కు చెందిన అశోక్ స్థానికంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు. శుక్రవారం పట్టణ సమీపంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల జిపిఆర్ గార్డెన్లో వివాహ వేడుకలు చిత్రీకరించేందుకు అశోక్ ఫోటోగ్రాఫర్ గా వెళ్ళారు. ఉదయం నుంచి ఫోటోలు తీసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు వధూవరుల ఫోటోలు చిత్రీకరిస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. గమనించిన స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటుతోనే మరణించినట్లుగా నిర్ధారించారు. అశోక్ పాత తాండూరు నివాసిగా ఉన్నాడు. గత 20 సంవత్సరాల నుంచి ఫోటోగ్రాఫర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. ఆయనకు ఓ కుమారుడు, ఒక కుమార్తె ఉంది. సీనియర్ ఫోటోగ్రాఫర్ అయిన అశోక్ మరణం పట్ల తాండూరు ఫోటోగ్రాఫర్లందరూ నివాళులు అర్పించారు.