చేవెళ్ల పార్లమెంటు బీజేపీదే..!
– ఓటింగ్ పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేశ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీ స్థానం బీజేపీదే అని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశము ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన పార్లమెంట్ పోలింగ్‌లో ఓటింగ్ శాతం బీజేపీకి అనుకూల వాతావరణం పట్ల ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
తాండూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీజేపీ మెజారిటీ సాధిస్తుందన్నారు. ఇదే తరహాలోనే మిగతా 6 అసెంబ్లీ ప్రాంతాల్లో కూడా మెజారిటీ వస్తుందని, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు దాదాపుగా ఫలితాల కంటే ముందే ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా చిత్తశుద్ధితో పని చేసిన కార్యకర్తలు,నాయకులకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, సీనీయర్ నాయకులు బాలి రాజశేఖర్, కౌన్సిలర్ సాహు శ్రీలత, బొప్పి శ్రీహరి, జుంటుపల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

