చెత్తను ఆర్ఆర్ఆర్ చేద్దాం..!
– ప్లాస్టిక్ నియంత్రణకు సహాకారం
– కౌన్సిలర్ సంగీత ఠాకూర్
– పారిశుద్ధ్య డ్రైవ్‌పై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలు తమ ఇండ్లలోని చెత్తను ఆర్ఆర్ఆర్(రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) చేయాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శనివారం వార్డులోని గాంధీనగర్‌లో మేరీ లైఫ్, మేరా స్వచ్చ షహేర్ కింద పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై వార్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్య పరిచారు. అనంతరం కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇండ్లలో తడి చెత్త, పొడి చెత్తను వేరుగా చేయడం అలవర్చుకోవాలన్నారు. ఇంట్లో పాత వస్తువులను ఆర్ఆర్ఆర్ కేంద్రాలకు అందించాలని సూచించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తవులు, కవర్లు వినియోగించడం మానుకోవాలన్నారు. స్వచ్ఛతను పాటించి వార్డును సుందరంగా ఉంచుకుని ఆదర్శంగా నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ కృష్ణ, సీఈఓ రాజేశ్వరి గారు, ఆర్పి శోభా గారు,మున్సిపల్ జవాన్లు, మున్సిపల్ వర్కర్లు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడ చదవండి…
పట్నం ఇంటికి పైలెట్..!
– ఇరువర్గాలలో జోరుగా చర్చలు
– రాజకీయ పరిణాలపై మాటామంతి
https://dharshininews.com/17369


