గణేష్ లడ్డూపై క్రేజ్..!
– వేలంలో సొంతం చేసుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: యేటా యేటా జరిగే గణేష్ ఉత్సవాలలో లడ్డూ వేలం క్రేజీగా నిలుస్తోంది. మండపాలలో ప్రతిష్టించిన వినాయకుని చేతిలో ఉంచిన లడ్డును సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఐదు రోజుల పాటు పవిత్రంగా పూజలందుకున్న లడ్డును దక్కించుకుంటే సకల శుభాలు కలగడమే కాకుండా దోషాలు, పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగా నిమజ్జనం రోజు జరిగే లడ్డుల వేలంలో భక్తులు పోటా పోటీ పడుతుంటారు. ఒకరికంటే ఒకరు అత్యధిక ధరలను పాటి దక్కించుకుంటారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో వినాయక నిమజ్జనం రోజు జరిగే లడ్డూల వేలం ఆసక్తికరంగా జరుగుతోంది. ఈ సారి కూడా శుక్రవారం జరిగిన నిమజ్జన వేడుకలలో లడ్డూలను వేలం పాడి దక్కించుకున్నారు. పట్టణంలోని భద్రేశ్వర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన లడ్డూ వేలంలో కనం శ్రావణ్ కుమార్, శివకుమార్ స్వామిలు ఇద్దరు కలిసి గణేష్ లడ్డూను రూ. 1లక్ష రూపాలు వేలం పాడి దక్కించుకున్నారు. అదేవిధంగా పాత తాండూరు దోబి గల్లీలో వినాకుడి వద్ద ఉన్న లడ్డును చాకలి వెంకటయ్య అనే వ్యక్తి రూ. 2 లక్షల 17వేల 1లకు సొంతం చేసుకున్నారు. మరోవైపు తాండూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సంగెం మేఘనాథ్ గౌడ్ పట్టణంలోని మఠం గల్లిలో, సాయిపూర్‌లో భారీ ధరలకు లడ్డులను సొంతం చేసుకున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా భక్తులు గణేష్ లడ్డులను దక్కించుకున్నారు.

ఇదికూడా చదవండి…

