కరన్‌ కోట్ జీపీ సేవలు భేష్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కరన్‌ కోట్ జీపీ సేవలు భేష్‌..!
– ప్రశంస సర్టిఫికెట్‌ ప్రకటించిన ఐఎస్‌ఓ
– జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేత
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలోని కరణ్‌ కోట్ గ్రామ పంచాయతీ భేష్‌ అనిపించుకుంది. గ్రామాభివృద్ధిలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం పట్ల ఇంటర్నెషనల్‌ స్టాండర్ట్ ఆర్గనైజేషన్‌(ఐఎస్‌ఓ) సంస్థ పంచాయతీకి సర్టిఫికెట్‌ను ప్రధానం చేసింది. గత వారం రోజుల క్రితం ఐఎస్‌ఓకు చెందిన క్వాలిటీ అధికారులు కరణ్‌ కోట్ గ్రామ పంచాయతిని సందర్శించారు. గ్రామంలో సర్పంచ్ వీణ హేమంత్ కుమార్ చేపట్టిన అభివృద్ధితో పాటు పాఠశాల, అంగన్‌ వాడిల నిర్వహణ, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణం, స్మశాన వాటికలు, చెత్త సేకరణ, డంపింగ్ యార్డు వంటి విభాగాలను పనితీరును సమీక్షించింది. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం పట్ల ఐఎస్ఓ సర్టిఫికెట్‌కు ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా కరణ్‌ కోట్ గ్రామ సర్పంచ్ వీణ హేమంత్ కుమార్‌కు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను అందజేశారు. గ్రామంలో ఆదర్శవంతమైన సేవలను అందించడం పట్ల కలెక్టర్ నారాయణరెడ్డి సర్పంచ్‌ను వీణను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ తరుణ్‌, డీఆర్డీఓ పీడీ కృష్ణన్, సీఈఓ జానకీరెడ్డి, డీఎల్‌పీఓలు శంకర్ నాయక్, అనిత, తాండూరు మండల ఎంపీఓ రతన్ సింగ్, పంచాయతీ కార్యదర్శి అనంద్ కుమార్, కరణ్‌ కోట్ ఉపసర్పంచ్ హేమంత్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage